మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పానవిశేష మత్త చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు వినుతగుణశీల! మాటలు వేయునేల?……….
http://www.jaitelangana.com/poets/telangana-poets/
http://www.telugupedia.com/wiki/index.php?title=Bammera_Pothana